29 April, 2026 | 3:26 AM

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో..భారీగా డ్రగ్స్ పట్టివేత

29-04-2026 01:30 AM

రూ.11.40 కోట్లు విలువైన క్రిస్టల్ మెత్ డ్రగ్స్ సీజ్

సికింద్రాబాద్ ,ఏప్రిల్ 28 (విజయక్రాంతి) : నగరంలో మరోసారి మత్తు పదార్థాల కలకలం రేగింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటె లిజెన్స్ అధికారులు నిర్వహించిన మెరుపు దాడిలో సుమారు రూ. 11.4 కోట్ల విలువైన 11.4 కిలోల నిషేధిత క్రిస్టల్ మెత్ (యాంఫెటమైన్) పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఆపరేషన్‌లో అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు భారతీయ మహిళలను అధికారులు అరెస్ట్ చేశారు.

తమ ట్రాలీ బ్యాగుల్లోని బెడ్‌షీట్ మడతల మధ్య అత్యంత చాకచక్యంగా ప్యాకెట్లను దాచి తరలిస్తుండగా,పక్కా సమాచారంతో నిఘా ఉంచిన అధికారులు వారిని అడ్డుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను  ఎన్. డీపీఎస్ చట్టం కింద సీజ్ చేసి, ఈ ముఠా వెనుక ఉన్న అంతర్జాతీయ సం బంధాలపై విచారణ ముమ్మరం చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న ఈ దందాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ కేసులోఇద్దరు మహిళ నిందితులను అరెస్ట్ చేసిన డిఆర్‌ఐ అధికారులు తెలియజేశారు.