21-01-2026 12:50:40 AM
మాల్యాల, విజయక్రాంతి: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. కొండగట్టు అంజన్న క్షేత్రం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో అంజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వివిధ జిల్లాల నుంచి భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకొని అక్కడి నుంచి కొండగట్టుకు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.