calender_icon.png 21 January, 2026 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్రెగుట్టల్లో సీఆర్పీఎఫ్ క్యాంప్ ప్రారంభం

21-01-2026 12:51:16 AM

పామునూరులో అధికారికంగా ప్రారంభించిన సీఆర్పీఎఫ్ ఐజీ విక్రమ్ 

వెంకటాపురం(నూగూరు), జనవరి 20(విజయక్రాంతి): దండకారణ్యంలోని కర్రగుట్టలో పామునూరు ప్రాంతంలో సిఆర్పిఎఫ్ 39 బేస్ క్యాంపును మంగళవారం సి ఆర్ పి ఎఫ్ ఐ జి విక్రమ్ అధికారికంగా ప్రారంభించారు. మావోయిస్టుల కంచుకోటగా ఒకప్పటి ప్రాంతమైన ఈ గుట్టల్లో బేసిక్ కంపెనీ ఏర్పాటుచేసి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. 2026 మార్చి నెలాఖరు నాటికి దేశంలో మావోయిస్టులను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగానే దాదాపుగా మావోయిస్టులు ఈ ప్రాంతంలో లేకుండా భద్రతా బలగాలు చర్యలు తీసుకున్నాయి.

ఎండాకాలం అనుకున్న కర్రెగుటల్లో సిఆర్పిఎఫ్ సారిద్యం లోని భారీ ఎత్తున 39వ నెంబర్ బెటాలియన్ ప్రారంభించడంతో భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో ఈ ప్రాంతంపై పట్టు సాధించాయనే చెప్పాలి. ఈ బెటాలియన్ ప్రారంభం సందర్భంగా సి ఆర్ పి ఎఫ్ ఐ జి విక్రమ్ మాట్లాడుతూ మావోయిస్టులను పూర్తిస్థాయిలో వేరువేయడంతోపాటు కరేగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆ దిశగానే ఈ ప్రాంతంలో పరివిన్ని బేస్ క్యాంపు ల ఏర్పాటుతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధికి గిరిజనుల ప్రయోజనాలకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.

అర్హులైన గిరిజనులకు ప్రభుత్వాల నుంచి రావలసిన సంక్షేమ పథకాలను ఇకపై పూర్తిస్థాయిలో అందేలా కృషి జరుపనున్నట్లు తెలిపారు. వాజేడు మండలం మురుమూరు గ్రామం నుండి పావునూరుకు 9 కిలోమీటర్ల మేర గుట్టలపై రహదారి నిర్మాణం చేపట్టి ఈ బేస్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ రహదారి మార్గం గుండా ఛత్తీస్గడ్ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాకు రవాణా సౌకర్యాలు మరియు అవకాశాలు అధికంగా ఉన్నాయి తద్వారా కర్రెగుటలను పూర్తిస్థాయిలో ప్రజా జీవన యోగ్యంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీస్ అధికారులు పాల్గొన్నారు.