calender_icon.png 6 May, 2025 | 11:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని అడ్డుకుంటున్న కార్పొరేటర్ లచ్చిరెడ్డి‌ని అరెస్టు చేయాలి

03-05-2025 11:38:49 PM

బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అరవింద్ రెడ్డి...

ఎల్బీనగర్: బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని అభివృద్ధిని అడ్డుకుంటూ.. వివాదాలు సృష్టిస్తున్న కార్పొరేటర్ లచ్చిరెడ్డితో పాటు బీజేపీ కార్పొరేటర్లను అరెస్టు చేయాలని బీఆర్ఎస్ బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో లచ్చిరెడ్డిని అరెస్టు చేయాలని బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అరవింద్ రెడ్డి మాట్లాడుతూ...  మే 1న ఎన్జీవోస్ కాలనీలో లైబ్రరీ గ్రౌండ్ లో రూ, 1.95 కోట్ల నిధులతో నూతన లైబ్రరీ భవనానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ప్రజలకు ఉపయోగపడే లైబ్రరీ భవనం నిర్మాణ శంకుస్థాపన విషయంలో బీజేపీ కార్పొరేటర్లు కావాలనే వివాదం సృష్టిస్తున్నారని ఆరోపించారు. 

కార్పొరేటర్లు మొద్దు లచ్చి రెడ్డి‌, వంగా మధుసూదన్ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనపల్లి శ్రీనివాస్ రెడ్డి వారి అనుచరులు రౌడియిజం ప్రదర్శిస్తూ, అభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ఆస్తులను ధ్వంసం చేసినందుకు నాన్‌ బెయిలబుల్ యాక్ట్ కింద బీజేపీ కార్పొరేటర్లపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు  వనస్థలిపురం పోలీస్ స్టేషన్  ఏసీపీ కాశిరెడ్డి, సీఐ శ్రీనివాస్ కు అరవింద్ రెడ్డి ఫిర్యాదు పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవి కుమార్ గుప్తా, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ గౌడ్, నాయకులు రవి ముదిరాజ్, మల్లేశ్ గౌడ్, మువ్వ సతీశ్ చౌదరి, మునగాల రాఘవేందర్‌ రావు,  గౌరిశెట్టి మనోజ్ కుమార్, దయాకర్ ముదిరాజ్, గంగం శివశంకర్, సుధాకర్ యాదవ్, శశిధర్ రెడ్డి, ఆనంద్ రాజ్, మధుసూధన్ రెడ్డి, పోగుల రాంబాబు, గంగం రాజు, అర్షద్, జుబేర్, రషీద్, బోయపల్లి శ్రీకాంత్ రెడ్డి, గడల శేఖర్, రాజా యాదవ్,‌ భాస్కర్ గౌడ్, సురేశ్, రాంకోటి,‌ శంకర్, కుంచాల రాంబాబు, పారంద శ్రీకాంత్, ప్రకాశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.