calender_icon.png 8 November, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ బ్రిడ్జి చెక్‌పోస్ట్ ఆకస్మికంగా తనిఖీ

08-11-2025 12:00:00 AM

మక్తల్ సీఐ రాంలాల్

మాగనూరు, నవంబర్ 7: మాగనూరు (కృష్ణ) నారాయణపేట జిల్లాలోని కృష్ణ శాశ్వత చెక్ పోస్ట్ ను మక్తల్ సీఐ రామ్ లాల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాహన దారులను తనిఖీ చేసి డ్రైవింగ్ లైసెన్సు ,వాహనాల పత్రాలు ,హెల్మెట్ వినియోగము ,వాహనాలలో తనిఖీల్లో నిబంధనలు పాటించడం వంటి అంశాలను పరిశీలించారు

,అనుమానాస్పద వాహనాలు వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీ చేపట్టాలన్నారు ప్రజల భద్రత రోడ్డు ప్రమాదాల నివారణ నేర నియంత్రణ దృశ్య ఇలాంటి తనిఖీలు నిరంతరము కొనసాగుతున్నాయని అలాగే కర్ణాటక రాష్ట్రం నుండి జిల్లాలోకి అనుమానస్పదంగా ఎలాంటి వస్తువులు తరలించిన చట్టం ప్రకారము కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు ,చట్టాలను ,కచ్చితంగా పాటించాలని రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు చేపడుతున్న ఈ చర్యలకు ప్రజలు సహకరించాలని సిఐ అన్నారు.