08-11-2025 12:00:00 AM
హైదరాబాద్, నవంబర్7(విజయక్రాంతి): రైట్ నెక్ లింఫాంజియోమాతో 25 ఏళ్లుగా బాధపడుతున్న వ్యక్తికి హైదరాబాద్‌లోని మెడికవర్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్సను పూర్తి చేసి కొత్త జీవితాన్ని అందించారు. మెడికవర్ హాస్పటల్‌లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణ వివరాలను వెల్లడించారు.
నగరానికి చెందిన ఓ వ్యక్తి(40)కి మెడలో కీలకమైన నరాలు, రక్తనాళాలు, అన్ననాళం, శ్వాసనాళం సమీపంలో లింఫాంజియో మా ఏర్పడటంతో ఇబ్బందులకు గురయ్యాడు. గతం లో 2010, 2015 మరియు 2025లో రోగి మూడుసార్లు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. కానీ వాపు మళ్లీ రావడంతో సమస్య మరింత తీవ్రమైంది. దీంతో బాధితుడు మెడికవర్ వైద్యులను సంప్రదించాడు.
రోగి పరిస్థితిని పూర్తిగా అంచనా వేసిన అనంతరం డాక్టర్ రాహుల్ లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డాక్టర్ వెంకట్ పవన్, అనస్తేషియాలజీ విభాగం హెడ్ డాక్టర్ వేణుగోపాల్ నేతృత్వంలోని బృందం రోగికి అత్యంత క్లిష్టమైన రికన్స్ట్రక్టివ్ ఎక్సిషన్ సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. పునరా వృత లింఫాంజియోమాలు సాంకేతికంగా అ త్యంత సవాలుతో కూడినవనీ, వీటి ద్వారా తీవ్రమైన రక్తస్రావం, నరాలు, అంతర్గత అవయవాల గాయాల ప్రమాదం అధికంగా ఉంటుందని తెలిపారు.
రోగి పూర్తిగా కోలుకున్నారని, ప్రస్తుతం మెడ కదలికలు సాధారణంగా ఉన్నాయని, ఎటువంటి నరాల బలహీనతా, ఆరోగ్య సమస్యలూ లేవని వెల్లడించారు. డాక్టర్ వెంకట్ పవన్ మా ట్లాడుతూ, ‘మునుపటి ఆపరేషన్ల వల్ల ఏర్పడిన మచ్చల కారణంగా కణజాల పొరలను గుర్తించడం కష్టమైంది. ప్రధాన నరాలు, రక్తనాళాలు మరియు శ్వాసనాళం దెబ్బతినకుండా అత్యంత ఖచ్చితత్వంతో ప్రతి దశనూ పూర్తి చేయగలిగాం.
మా బృందం అద్భుతమైన సమన్వయం వల్లే ఈ విజయం సాధ్యమైంది,‘ అని తెలిపారు.అనంతరం రోగి మాట్లాడుతూ 25 సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడ్డాను. హోమియోపతి, నూనె మసాజ్లు, స్థాని క చికిత్సలు అన్నీ ప్రయత్నించాను. ఉపశమనం దొరకకపోగా, సమయాన్ని, డబ్బును మాత్రమే వృథా చేసుకు న్నాను. నేను అందరికీ చెప్పదలిచింది ఒక్కటే ఇలాంటి సమస్యలకి నిర్ధారణలేని వైద్యం చేయించకండి. అర్హత కలిగిన వైద్యులను సంప్ర దించండి, సరై న చికిత్స పొందండి. అదే నా జీవితాన్ని కాపాడింది అని తెలిపారు.