30 August, 2026 | 9:06 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

కృష్ణమ్మ పరవళ్లు

27-06-2025 12:10 AM

గద్వాల/నాగర్‌కర్నూల్, విజయక్రాంతి: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కర్ణాటకలోని నారాయణపుర ప్రాజెక్టు నుంచి వరద భారీ గా వస్తుండటంతో జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో గంట గంటకు పెరుగుతున్నది. గురువారం రాత్రి 9 గంటల కు అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారంగా నారాయణపుర నుంచి 98 వేల క్యూసెక్కుల వరద నీరు జూరాలకు వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తి 74,052 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. పవర్ హౌస్‌కు 27,384 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్‌కు 650 క్యూసెక్కులు, కోయిల్ సాగర్‌కు 315 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 550 క్యూసె క్కులు, కుడి కాలువ ద్వారా 290 క్యూసెక్కులు వదు లుతున్నారు.

జూరాల నుంచి శ్రీశైలానికి 96,621 క్యూసెక్కుల జలాలు వచ్చి చేరుతున్నాయి. 885 అడు గులు, 215 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 863.16 అడుగులకు చేరుకొని 115.9856 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపిస్తోంది.