calender_icon.png 26 July, 2025 | 10:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్ ట్యాపింగ్‌తో.. పెళ్లాం మొగుళ్ల మాటలు విన్నారు

27-06-2025 12:09:08 AM

  1. ఏ మొహం పెట్టుకొని శ్వేతపత్రం అడుగుతున్నావ్ హరీశ్ 
  2. తొమ్మిదేళ్ల తర్వాత సీఎం పదవి కోసం ప్రయత్నిస్తా..
  3. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ హయాంలో కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు, ఇంటెలిజెన్స్, టాస్క్‌ఫోర్స్ అంతా కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతల ఫోన్లను ట్యాపింగ్ చేయడమే పనిగా పెట్టుకున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారె డ్డి మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత రాత్రిపూట ఫోన్ల వద్దే పడుకునే వారేమోనని అన్నారు. చివరకు మొగుడు పెళ్లాలు మాట్లాడుకున్నవి కూడా రికార్డు చేశారంటూ ఫైరయ్యారు.

గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడు తూ.. గతంలో తాము చేయని పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. హరీశ్‌రావు ఏం ముఖం పెట్టుకొని శ్వేతపత్రం అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పదవిపై జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మూడేళ్లు సీఎంగా రేవంత్‌రెడ్డినే ఉంటారని, వచ్చే ఐదేళ్లు మళ్లీ సీఎం అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

అం దుకు వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్‌రెడ్డి ఇప్పటి నుంచే ప్రయ త్నం చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. తొమ్మిదేళ్ల తర్వాత సీఎం పదవి నుంచి రేవంత్‌రెడ్డి దిగిపోయాక.. తాను సీఎం అయ్యేందుకు ప్రయత్నం చేస్తానని, అందుకు ప్రజల దగ్గర తన అప్లికేషన్ పెడుతానని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ కుటుంబం కొంతమందిని లక్ష్యంగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడిందని దుయ్యబట్టారు. తన ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు గతంలో చాలా మంది పోలీసు అధికారులే చెప్పారని, తన ఫోన్ ట్యాప్ చేసి పీకేదేముందని వారితో చెప్పానన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఎడాది మినహా మిగతా ఎనిమిదేళ్లు కేసీఆర్ మొత్తం ఇదే పనిమీద ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్టంలో అప్పులు తీసుకునేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి వెసులుబాటు ఉండేదని, దీన్ని ఆసరాగా చేసుకుని కేసీఆర్ అడ్డగోలుగా అప్పులు చేశారని జగ్గారెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల, మాకు ముళ్లబాట ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుభరోసా విషయంలో హరీశ్‌రావు హర్షించాల్సింది పోయి కడుపు ఉబ్బరంతో మాట్లాడుతున్నారని ఆయన  విమర్శించారు. ఎమ్మెల్సీ కవిత ప్రతి అంశాన్ని రాద్దాంతం చేస్తోందని మండిపడ్డారు. కవిత బీఆర్‌ఎస్‌లో ఉంటే ఏంటీ? బయటకు వస్తే ఏంటీ? అని ప్రశ్నించారు. తండ్రి వారసత్వం కొడుకుకే ఉంటుందని, ఒక వేళ కొడుకు లేకపోతే కూతురికి వచ్చే అవకాశం ఉటుందన్నారు.