మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా స్వాగతించిన నియోజకవర్గ ఇన్చార్జ్
13-06-2026 01:42 PM
బోథ్, జూన్ 13(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాలో జరిగే పలు కార్యక్రమంలో హాజరయ్యారు. అయితే మంత్రిని కాంగ్రెస్ పార్టీ బోత్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడ గజేందర్ నేరడిగొండ మండలంలోని టోల్ ప్లాజా వద్ద ఘనంగా స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మంత్రిని శాలువాతో సన్మానించడం జరిగింది. అనంతరం మంత్రి వెంట వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తరలి వెళ్లారు.






