20 April, 2026 | 3:47 AM

శ్రీ వేంకటేశ్వర ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు కేటీఆర్ హాజరు

20-04-2026 01:46 AM

వేములవాడ, ఏప్రిల్ 19(విజయక్రాంతి): మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలకు ఆదివారం కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు, వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం శ్రీదేవి, గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు.కే టీఆర్ను ఆలయ నిర్వాహకులు శాలువాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. భక్తులకు అభివాదం తెలుపుతూ, ఒక్కొక్కరిని పలకరిస్తూ ఆలయంలోకి ప్రవేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్‌ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు గోవర్ధన్ గౌడ్, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి, సర్పంచ్ గీతాంజలి శ్రీనివాసరెడ్డి, గ్రామ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.