05-12-2024 10:20:30 AM
హైదరాబాద్: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా భయమా..? పట్టుకొని నిలదీస్తే... అక్రమ కేసులా..? ఇదెక్కడి రాజకీయం..? ఇదేనా ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం? అని కేటీఆర్ ప్రశ్నించారు. మీ అక్రమాలను ప్రశ్నిస్తే మా ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారు. కానీ ఇవేవీ ప్రజా గొంతుకులైన మాకు అడ్డం కావని ఆయన వెల్లడించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా... ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు.