05-12-2024 10:40:04 AM
హైదరాబాద్: హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొండాపూర్ లో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలను గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద నుంచి పోలీసులు హరీశ్ రావును తరలిస్తున్నారు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు బీఆర్ఎస్ నేతలు కొత్త ప్రభాకర్ రెడ్డి, శంభీపూర్ రాజు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేరుకున్నారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంట్లోకి అనుమతించాలని పోలీసులతో నేతలు వాగ్వాదానికి దిగారు. గేటు దూకి కౌశిక్ ఇంట్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు.