రాజకీయాల్లో హత్యలుండవు.. ఆత్మహత్యలే
హైదరాబాద్: జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించారు. రాజకీయాల్లో హత్యాలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో పోయి ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నేను, కవిత వచ్చి గల్లీ గల్లీలో తిరిగి మన అభ్యర్ధులను గెలిపించుకొని సంజయ్‌ను జగిత్యాల నుండి తరిమికొడుదాం అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జగిత్యాల జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






