18 July, 2026 | 3:44 PM

ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి అరెస్ట్

01-07-2024 03:20 PM

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో నిరుద్యోగుల సమస్యలపై ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థి మోతీలాల్ నాయక్ ను ఆమరణదీక్ష చేస్తున్నారు. ఆయనను పరామర్శించడానికి గాంధీ ఆసుపత్రికి వెళ్లిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, జనగామ ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి లను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. నిరుద్యోగుల ఉద్యమానికి మద్ధతు తెలుపుతూ మీడియాతో మాట్లాడుతుండగానే ఎంఎల్ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేవు రేవంత్... మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు, ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు.