calender_icon.png 10 November, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందెశ్రీ మ‌రణం తెలంగాణ‌కు తీర‌ని లోటు!

10-11-2025 04:26:26 PM

టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి

సంగారెడ్డి: ప్రజాకవి, రచయిత అందెశ్రీ హఠాన్మరణం బాధాకరమ‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి విచారం వ్య‌క్తం చేశారు. సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ సంతాపం తెలిపారు. 2004లో సంగారెడ్డి ధూంధాంతో ఆయన పాటతో త‌న‌కు పరిచయమైందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందెశ్రీ పాటలు ప్రజలను చైతన్యపరిచాయి. తెలంగాణ గడ్డపై ప్రజాకవి అందెశ్రీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలది ప్రధాన పాత్రని, ఆయన మరణం తెలంగాణ ప్రజలకి తీరనిలోటన్నారు.

ఆయన మరణించినా అందెశ్రీ పాటకి మరణం లేదని, తనని పాట ఎప్పటికీ సజీవంగానే ఉంచుతుందన్నారు. అందెశ్రీ పాట వింటే పాటలో లీన‌మ‌వుతామ‌ని, సమాజం గురించి, మనిషి గురించి, మనుషులు ఎలా వుండాలనే దానిపై అందెశ్రీ పాటలు మనలో చైతన్యం కలిగిస్తాయ‌న్నారు. ఆయన ఆత్మకుశాంతి కలగాలని, ఆయ‌న కుటుంబ సభ్యులకు జ‌గ్గారెడ్డి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.