10-11-2025 04:22:03 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి హై స్కూల్ చదువుతున్న విద్యార్థిని దాసరి శ్రేష్ఠవి అండర్-17 విభాగంలో రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచింది. ఈ నెల 7 నుండి 9వ తేదీ వరకు నారాయణపేటలో జరిగిన రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటిల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జట్టులో శ్రేష్టవి ఆడి మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించారు. ఈ సందర్భంగా శ్రేష్టవి, పిఈటి గోగర్ల సాయిని సోమవారం పాఠశాల ప్రిన్సిపల్ మహేశ్వర్ రావు, కరస్పాండెంట్ ప్రసాద్, మేనేజ్మెంట్ సభ్యులు రాజ్ కుమార్, దాసరి సురేష్, కుమార్, అజయ్ అధ్యాపక బృందం, విద్యార్థులు అభినందించారు.