10-11-2025 04:30:07 PM
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద..
ప్రమాదాల నిలయం ఆ రహదారి..
భద్రత చర్యలు చేపట్టాలి..
బోయినపల్లి (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి రహదారి ప్రమాదాలను నిలయంగా మారి ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు. ఈ రహదారిలో ఇప్పటివరకు ఎన్నో ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగినప్పుడు స్పందించిన అధికారులు మళ్లీ భద్రత విషయం గాలికి వదిలేస్తున్నారు. సంఘటన జరిగిన హుటాహుటిన స్పందించిన అధికారులు మళ్లీ ప్రమాదం జరగకుండా తీసుకోవాల్సిన రక్షణ చర్యలు తనిఖీలు చేసిన పాపాన అధికారులు లేకపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కరీంనగర్ నుంచి బోయినపల్లి మండలం కొదురుపాక వేములవాడ రహదారి అత్యంత ముఖ్యమైనది.
ఈ ప్రధాన రహదారి నుంచి వేములవాడ రాజన్న ఆలయంకు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంకు, కామారెడ్డి పట్టణానికి నిత్యం వేలాది వాహనాలు ఆర్టీసి బస్సులు లారీలు ఇతర వాహనాలు రాజన్న ఆలయంకు భక్తులు వెళుతుంటారు. మళ్లీ తిరుగు ప్రయాణంలో కరీంనగర్, హన్మకొండ, వరంగల్, గోదావరిఖని, రామగుండం, ఖమ్మం, కొత్తగూడెం పట్టణాలకు ప్రజలు భక్తులు వెళుతుంటారు. ఈ రహదారి ప్రజలకు భక్తులకు అత్యంత ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి వద్ద ఒక ప్రైవేటు హోటల్ ఉంటుంది. ఆ హోటల్ ముందు మధ్యాహ్నం నుంచి సాయంత్రం, రాత్రి వరకు కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులు ఉద్యోగులు తమ వాహనాలను ఆపుకుని ఆ హోటల్లో టిఫిన్ చేసి టీ తాగి వెళ్తుంటారు. వాహనాల యజమానులు లారీలు హోటల్ ముందు రోడ్డు పైనే వాహనాలు నిలుపుకోగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇప్పటివరకు ఎన్నో ప్రమాదం జరిగాయి. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. గత సంవత్సరం డిసెంబర్ 25న హోటల్ ముందు లారీ లారీ నిలిపి ఉండగా వేములవాడ వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు లారీని వెనుక వైపు నుంచి డీకోట్టగా కారులోని మంగమ్మ అనే మహిళ మృతిచెందగా, అందులో ప్రయాణిస్తున్న అశోక్ గట్టయ్యలకు తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగా అందులో మరో వ్యక్తి చికిత్స పొందు ల మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో రోడ్డుపై నిలిచి ఉన్న లారీని కారు ఢీకొట్టగా అందులో ఇరుక్కుపోయిన మహిళను వ్యక్తులను బయటకు తీయడానికి పోలీసులు తోటి ప్రయాణికులు గ్రామస్తులు నానా తంటలు పడ్డారు.
వారిని బయటకు తీయడానికి తలకి మించిన భారంతో చాలా సమయం వెచ్చించగా వారిని బయటకు తీశారు. ఈ సంఘటన అప్పట్లో ఉమ్మడి జిల్లాలో చర్చ నీ అంశంగా మారి అప్పటి అధికారులు చాలా సీరియస్ గా తీసుకొని వెంకటరావుపల్లి వద్ద వాహనాల వేగం తగ్గించేందుకు స్టాపర్లు ఏర్పాటు చేశారు. ఈ సంఘటన అనంతరం హోటల్ యజమానికి నోటీసు అందించి హోటల్ ముందు పార్కింగ్ రహదారిపైకి వాహన నిల్పకుండా చూసుకొని సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అప్పుడు కుదురు మాత్రమే మొక్కుబడిగా సెక్యూరిటీ గార్డ్ పెట్టుకొని విటల్ యజమాని వాహనాలను క్రమబద్ధీకరించాడు. మళ్లీ ఇప్పుడు యధావిధిగా రోడ్డుపైన వాహనాలు హోటల్ ముందు నిలబడంతో కరీంనగర్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయం భయంగా వెళుతున్నారు. పోలీస్ శాఖ, ఆర్టీవో అధికారులు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా భద్రత చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.