1 April, 2026 | 8:41 AM

మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం

06-05-2024 01:12 AM

ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలని విజ్ఞప్తి

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): పద్మశ్రీ మొగులయ్యకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారుల పింఛన్ నిలిపేయడంతో ఆయన కూలి పని చేసుకుంటున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో కేటీఆర్ స్పందించారు. ఆదివారం హైదరాబాద్‌లో మొగులయ్యను కలిసి కొంత ఆర్థిక సాయం అందజేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పింఛన్‌తోపాటు అన్ని రకాల హామీలను నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మొగులయ్య లాంటి జానపద కళాకారులు తెలంగాణకు గర్వకారణమని, వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సి బాధ్యత ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు.