25-07-2024 12:13:09 AM
హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి)/రాజేంద్రనగర్, జూలై 24: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్టేట్‌హోమ్ లోని వందమంది విద్యార్థినులకు ల్యాప్‌టాప్‌లు అందజేశారు. అలాగే రాష్ట్రంలో ఆత్మ హత్య చేసుకున్న నేత కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుల పిల్లల విద్య, భవిష్యత్తు అవసరాల కోసం సహాయం చేయనున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు అట్టహా సంగా నిర్వహించారు. తన తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తల్లి శోభమ్మకు పాద నమస్కారాలు చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వేడుకల్లో కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు రియాన్షి పాల్గొన్నారు. మణికొండ మున్సిపల్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కంభగళ్ల ధన్‌రాజ్ ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆ పార్టీ యువనేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి హాజరై కేక్ కట్ చేశారు.
కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంత్‌రావు చౌహాన్, ఆలస్యం నవీన్‌కుమార్, మహిళా విభాగం అధ్యక్షురాలు రూపారెడ్డి, నేతలు ముత్తంగి లక్ష్మయ్య, నర్సింగ్‌రావు, అందె లక్ష్మణ్‌రావు, ఉపేంద్రనాథ్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, కీర్తిలతాగౌడ్, విజయలక్ష్మి, శ్రీకాంత్, షేక్ ఆరీఫ్, రామసుబ్బారెడ్డి, మహేష్, బాబు, దిలీప్, కిరణ్, భాను, బాలాజీ, తిరుపతి, ఎల్లాస్వామి తదితరులు పాల్గొన్నారు.