calender_icon.png 21 November, 2025 | 12:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు చోట్ల ఎక్సైజ్ దాడులు

25-07-2024 12:14:36 AM

  • గంజాయి స్వాధీనం.. ఎనిమిది మంది అరెస్ట్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి, సీఐలు మధుబాబు, గోపాల్ ఆధ్వర్యంలో 50 మంది సిబ్బంది బుధవారం ధూల్‌పేట్‌లో దాడులు నిర్వహించారు. పలుచోట్ల 2.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు ఆమ నీలేష్‌సింగ్, గుండు సింగ్, నీతూభాయ్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో  సిబ్బంది దాడులు నిర్వహించి నాలు గు కిలోల గంజాయి పట్టుకున్నారు. దుండిగల్‌కు చెందిన నిందితులు కార్తీక్, కోమల్, కార్తీక్‌ను అదుపులోకి తీసుకున్నారు.