calender_icon.png 21 November, 2025 | 11:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హత లేని డాక్టర్ పై కేసు నమోదు

21-11-2025 11:36:52 AM

హన్మకొండ,(విజయక్రాంతి): అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న శేషు కుమార్ పై కేసు నమోదు చేసినట్టు ఇన్ స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు. హనుమకొండ కాకాజీ కాలనీలో(Hanamkonda Kakaji Colony) డాక్టర్ శేషు కుమార్ జీఎల్ఎస్ డెంటల్, ఇంప్లాంట్ సెంటర్ ను నిర్వహిస్తు న్నాడన్నారు. నిజానికి శేషుకుమార్ కు ఎలాంటి విద్యార్హతలు లేవని, ఎండీఎస్ లేకున్నా ఉన్నట్టుగా ప్రకటనలు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు.

ఈ మేరకు కొంతకాలంగా ప్రజలను మోసం చేస్తున్నట్టుగా వరంగల్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అధికారులు, రాష్ట్ర దంత వైద్య మండలి, హను మకొండ కలెక్టర్, జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదు మేరకు రాష్ట్ర దంతమం డలి, జిల్లా వైద్యాధికారి ప్రాథమిక విచారణ జరిపి డాక్టర్ శేషు కుమార్ కు ఎలాంటి అర్హతలు లేవని తేల్చారన్నారు. ఈ మేరకు డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధి కారి చేసిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఇన్ స్పెక్టర్ శివకుమార్ తెలిపారు.