నడి రోడ్డుపై మద్యం వాహనం బోల్తా.. పండుగ చేసుకున్న మందుబాబులు
22-05-2024 06:57 PM
హైదరాబాద్ : బోయిన్ పల్లిలో మద్యం సీసాల లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. వాహనం టైర్ పంక్చర్ కావడంతో డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో వాహనంలోకి మద్యం బాటిల్లు రోడ్డుపై పడి పగిలిపోయాయి. మరికొన్ని మద్యం బాటిల్లను వాహనాదారులు, స్థానికులు అందినకాడికి తీసుకెళ్లారు. దీంతో మద్యం సీసాలు రోడ్డుపై పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పాడింది. అక్కడికి సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు వేంటనే స్పందించి వాహనానికి రక్షణ కల్పించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేసుకొని ట్రాఫిక్ రద్దీని క్రమబద్ధీకరించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.






