calender_icon.png 17 May, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉద్యోగ సంఘాల మాజీ నాయకులతో కేటీఆర్, హరీశ్ రావు భేటీ

17-05-2025 12:40:48 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు భేటీ అయ్యారు. శనివారం హరీశ్ రావు నివాసంలో ఉద్యోగ సంఘాల మాజీ నేతలతో సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీప్రసాద్, పాతూరి సుధాకర్ పాల్గొన్నారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు, వివిధ అశాలపై సమాలోచనలు చేశారు.