17-05-2025 09:46:15 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): మే 23 నుంచి 28 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ విభాగంలోని ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) గ్రేడ్ పోస్టులకు సంబంధించి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు. ఈమేరకు శుక్రవారం టీజీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఉదయం 10.30 గంటల నుంచి నాంపల్లిలోని సురవరం ప్రతాప రెడ్డి తెలుగు వర్సిటీ నందు హాజరుకావాలని సూచించారు. వెరిఫికేషన్‌కు హాజరయ్యే అభ్యర్థుల జాబితా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.