20 July, 2026 | 8:39 PM

కేటీఆర్‌కు నీతి లేదు!

20-07-2026 01:28 AM
  1. తెలంగాణ ఇచ్చిన కుటుంబం చావు కోరుకుంటావా ?
  2. ఇదేనా తెలంగాణ సంస్కృతి..
  3. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైర్ 

సంగారెడ్డి, జూలై 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ కొడుకు కూతురైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చావును కోరుకుంటావా? కేటీఆర్‌కు నీతి లేదని, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి 562 మం దికి గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా? అని సవా ల్ విసిరారు. ఆదివారం రాత్రి సంగారెడ్డిలో మీడియాతో జగ్గారెడ్డి మాట్లాడారు.

సరూర్‌నగర్ సభలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు డెత్ డిక్లరేషన్ అనడం పట్ల మండిపడ్డా రు. సోనియాగాంధీ దయతో పదేళ్లు రాజభోగాలు అనుభవించిన కేటీఆర్‌కు నీతి లేదని విమర్శించారు. చావుకోరుకోవడమే నీ సంస్కృతియా? నిలదీశారు. తెలంగాణ ఇస్తే చర్మం వొలిచి చెప్పులు కుట్టిస్తానని అన్న మాటలు మరిచావా? అని ప్రవ్నించారు.

ఇప్పుడు కృతజ్ఞత లేని మాటలు మాట్లాడుతున్నావని మండిపడ్డారు. గ్రూప్-1 లీక్‌పై నిరుద్యోగులకు సమాధానం చెప్పవా? అని నిలదీశారు. రాహుల్‌గాంధీ కుటుంబం విలువలతో కూడిన రాజకీయం చేస్తుందని, విలువలులేని రాజకీయాలు కేసీఆర్ కుటుంబానివని విమర్శించారు. వెంటనే కేటీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.