ప్రజలను మభ్యపెడుతున్న కేటీఆర్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ సిటీబ్యూరో, మా ర్చి 17 (విజయక్రాంతి): గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్ పదేపదే తప్పుదోవ పట్టిస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. పదేళ్ల ఆర్థిక విధ్వంసాన్ని ప్రశ్నిస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం దారుణమన్నారు. కోటి రూపాయల వాచీ అంటూ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని, దమ్ముంటే 30 వేలు ఇచ్చి ఆ వాచీ తీసుకోవాలని సవాల్ విసిరారు.
వ్యక్తిగత ఆత్మాభిమానంపై దెబ్బకొట్టడం మానుకొని, కేటీఆర్ వెంటనే ఆది శ్రీనివాస్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. కేటీఆర్ అసెంబ్లీలో అత్యంత అహంకారంతో ప్రవర్తిస్తున్నారని, వారి వైఖరి ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధంగా ఉందన్నారు. పాడి కౌశిక్‌రెడ్డి పోలీసు అధికారులను ఏకవచనంతో హెచ్చరిస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు.
పోలీసుల ఫైరింగ్ ప్రాక్టీస్ అనేది ఒక ఆనవాయితీ అని, దానిపై తప్పుడు ఆరోపణలు చేయడం కౌశిక్‌రెడ్డి గుండాఇజానికి నిదర్శనమన్నారు. బీఆర్‌ఎస్ నేతలు డ్రగ్స్ సంస్కృతికి అలవాటు పడ్డ బ్యాచ్ లాగా ప్రవర్తిస్తూ సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విప్ రాంచందర్‌నాయక్ మాట్లాడుతూ.. గతంలో సీతక్కపై చేసినట్లే ఇప్పుడు ఆది శ్రీనివాస్‌కు కూడా బీఆర్‌ఎస్ నేతలు అసత్య ప్రచారాలకు తెరలేపారని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం, అంబేడ్కర్ విగ్రహం నిర్మాణంలో అవినీతి జరిగిందని సొంత చెల్లెలు ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పని కేటీఆర్.. ఇత రులపై బురదజల్లుతున్నారన్నారు. బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేసిన బీఆర్‌ఎస్ నేతలను ప్రజలే తిరగబడి తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. కోటి రూపాయల వా చీ అంటూ తప్పుడు ప్రచారం మానుకొని, కేవలం 50 వేలు ఇచ్చి ఆ వాచీని కేటీఆర్ తీసుకోవాలని ఎద్దేవా చేశారు.
విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడుతూ, తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా బీఆర్‌ఎస్ నేతలు కుట్రలు చేయడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తంచేశారు. దుబాయ్ కేంద్రంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా తన వాచీ ఖరీదు కోటి రూపాయలని సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే బీఆర్‌ఎస్ నేతలు తనపై వ్యక్తిగత కక్షతో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు.
అసెంబ్లీ రూల్స్‌కు విరుద్ధంగా తన ఫొటోలు తీసి దుష్ప్రచారం చేస్తున్న వారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు కోరతానని స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసం గానికి ధన్యవాదాలు తెలపకుండా బీఆర్‌ఎస్ నేతలు కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే ఎజెండాగా పెట్టుకున్నారని విమర్శించారు.
డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ నిందితులను ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌కు మారి ఇప్పుడు ఆ పార్టీ డ్రగ్స్ రాష్ట్ర సమితిగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలోనే డ్రగ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని తాను ముఖ్యమంత్రిని కోరుతానని, అప్పుడు ఎవరి అసలు రంగు ఏంటో బయటపడుతుందన్నారు.




