calender_icon.png 28 July, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్

24-07-2025 06:58:47 PM

బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు(KTR) 49వ జన్మదిన సందర్భంగా గురువారం మండల కేంద్రం అర్వపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుండగాని సోమేష్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణకు భవిష్యత్తు ఆశాకిరణం కేటీఆర్ అని, తెలంగాణ బ్రాండ్ ను భవిష్యత్తులో కూడా విశ్వవ్యాపితం చేసేందుకు ఆ భగవంతుడు శక్తిని ప్రసాదించి, ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మోరిశెట్టి ఉపేందర్, మండల ప్రధాన కార్యదర్శి వల్లపు గంగయ్య,మాజీ ఎంపీటీసీ బొడ్డు రామలింగయ్య, వివిధ గ్రామాల గ్రామశాఖ అధ్యక్షులు ఓర్సు వెంకన్న, దుబ్బాక ఎల్లంరాజు, గోసుల విజయ్ ,నున్న యాదగిరి నాయకులు బందెల అర్వపల్లి, తాడూరి రాంకోటి, రాచకొండ మహేష్,కోటమర్తి మల్లయ్య, వేముల గణేష్, రవీందర్, లింగరాజు తదితరులు పాల్గొన్నారు.