24-07-2025 07:01:52 PM
కొత్తపల్లి (విజయక్రాంతి): భారత జాతీయ మహిళా సమాఖ్య ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యూ కరీంనగర్ నగర సమితి ముఖ్య కార్యకర్తలు సమావేశం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగింది. ఈ సమావేశంనకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షురాలు కిన్నెర మల్లవ్వ ప్రధాన కార్యదర్శి గరిగె శారదలు హాజరయ్యారు. నగర అధ్యక్షురాలుగా కొట్టె అంజలి, ఉపాధ్యక్షురాలుగా కడారి కావ్య, గుమ్మడి సుజాత, ప్రధాన కార్యదర్శిగా బీర్ల పద్మ సహాయ కార్యదర్శి ఉప్పు శ్రీగుణ, బీర్ల రజిత, కోశాధికారిగా భారతి మరో నలుగురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శి శారద ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అంజలి, పద్మ మాట్లాడుతూ.. నగరంలో మహిళల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతూనే మహిళా సమాఖ్య బలోపేతం కోసం పనిచేస్తామని అన్నారు.