24 June, 2026 | 12:28 AM

Breaking News

నరకానికి నకలు.. కెల్లేడు రహదారి   •   గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •  

సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు

24-07-2025 06:56 PM

-ఉదండాపూర్ భూ నిర్వాసితులకు రూ.175 కోట్లు మంజూరు 

- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి..

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోత పథకంలో భాగంగా ఉదండాపూర్ భూ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో భాగంగా ప్రభుత్వము రూ.175 కోట్లు మంజూరు చేసినట్లు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) తెలిపారు. భూ నిర్వాసితులకు మేలు చేయాలని సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు నీడనిచ్చేందుకు నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఉదండాపూర్ భూనిర్వాసితులకు సంబంధించి ఈ నిధులు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఈ నిధులను అర్హులైన వారికి ఖర్చు చేయడం జరుగుతుందని తెలియజేశారు.