calender_icon.png 22 September, 2025 | 2:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైడ్రా పేదల ఇళ్ళపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు

22-09-2025 01:41:35 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం కార్యకర్తలతో సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లను ఎందుకు కూల్చివేస్తుంది..? సెలవురోజుల్లో కూల్చివేతలు వద్దని హైకోర్టు స్పష్టంగా చెప్పినా కూల్చివేతలు ఆగడం లేదని మండిపడ్డారు. నిన్న గాజులరామారంలో సెలవురోజునే పేదల ఇళ్లు కూల్చారని.. రేపు జూబ్లీహిల్స్ లోని బోరబండకు కూడా సీఎం రేవంత్(CM Revanth Reddy) హైడ్రాతో వస్తారని అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. బుల్‌డోజర్ రాజ్యానికి లైసెన్స్ ఇచ్చినట్లేనని.. హైడ్రా బుల్‌డోజర్ పేదల ఇళ్ళపైకే వెళ్తుంది.. పెద్దల ఇళ్లకు వెళ్లదు అని పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువల్లో ఇళ్లు కట్టిన కాంగ్రెస్ నేతల జోలికి వెళ్లదు అని.. బీఆర్ఎస్ కార్యకర్త సర్ధార్ ఇంటిని కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేసిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్త సర్ధార్ కు మళ్లీ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత నాది అని కేటీఆర్ తెలిపారు.