calender_icon.png 22 September, 2025 | 3:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి.. బోగ్గు గని మాత్రమే కాదు.. ఉద్యోగ గని

22-09-2025 01:17:43 PM

హైదరాబాద్: సింగరేణి(Singareni) సంస్థ బోగ్గు గని మాత్రమే కాదు.. అది ఉద్యోగ గని కూడా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఆత్మవంటిదని.. సింగరేణి సంస్థను జాగ్రత్తగా నడుపుతున్న యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. సింగరేణి సంస్థలో అన్ని రకాల ఉద్యోగులు కలిసి 71 వేల మంది ఉన్నారని.. సింగరేణి లాభాల్లో కొంత మొత్తాన్ని ఉద్యోగులకు పంపిణీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి సంస్థ కలిసి గొప్ప నిర్ణయం తీసుకున్నాయని.. గత పదేళ్లు సింగరేణి సంస్థ కొత్త బ్లాక్ లకు వేలంలో పాల్గొనలేని పరిస్థితి ఉందన్నారు.

సింగరేణి సంస్థను వేలానికి దూరంగా పెట్టడం వల్ల రెండు బ్లాక్ లు కోల్పోయిందని.. ఆ రెండు బ్లాక్ లు గత ప్రభుత్వ నేతల సన్నిహితుల చేతికి వెళ్లాయని తెలిపారు. సింగరేణి సంస్థను గత ప్రభుత్వం నష్టాల్లోకి నెట్టాలని ప్రయత్నించిందని.. కీలక ఖనిజాల మైనింగ్ లోకి సింగరేణి సంస్థ వెళ్లేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. సింగరేణి లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు పంచాలని నిర్ణయించామని.. ఒక్కో కార్మికుడికి బోనస్ గా రూ. 1,95,610 పంపిణీ జరుగుతుందని అన్నారు. మొత్తంగా రూ. 819 కోట్లను సింగరేణి కార్మికులకు పంపిణీ చేస్తామని తెలిపారు.