calender_icon.png 22 September, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌

22-09-2025 01:02:28 PM

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు(Singareni workers) తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్‌ ప్రకటించింది. సింగరేణి లాభం రూ.2,360 కోట్లు లాభాల్లో 34 శాతం కార్మికులకు బోనస్‌ గా అందజేసింది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.1,95,610 బోనస్ అందనుంది. కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్‌ దక్కనుంది. మొత్తం కాంట్రాక్ట్ కార్మికులకు రూ.819 కోట్ల బోనస్‌ గా ప్రభుత్వం(Telangana government) ప్రకటించింది. సచివాలయంలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కార్మికులకు లాభాల వాటా బోనస్ ప్రకటన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క పాల్గొన్నారు.