20-08-2025 01:59:59 AM
హైదరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాం తి): కేయెన్స్ సెమీ కండక్టర్ పరిశ్రమ హైదరాబాద్ నుంచి గుజరాత్ తరలిపోవడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఆరోపించడం బట్టకాల్చి మీద వే యడం లాంటిదేనని.. నిరాధార, అసత్య ప్ర చారాలు చేయడం అయనకు అలవాటేనని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మం డిపడ్డారు. కేయెన్స్ ఇక్కడి నుంచి వెళ్లిపోయింది అనడం కంటే... కేంద్రం, గుజరాత్ బీజేపీ ప్రభుత్వాలు భారీ సబ్సిడీలు కుమ్మరించి లాక్కుపోయాయని చెప్పడం సబబు గా ఉంటుందన్నారు.
ఇది కేటీఆర్‌కు తెలుస ని.. అయితే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి ఇలాంటి ఆరో పణలు చేస్తుంటారని శ్రీధర్‌బాబు ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. గుజరాత్ సనంద్‌లో కేయెన్స్ సెమీకాన్ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకు ‘ఇండియా సెమీకండక్టర్ మిషన్’ (ఐ ఎస్‌ఎం) కింద ప్రాజెక్ట్ వ్యయంలో 50 శా తం సబ్సిడీ అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. రూ.76 వేల కో ట్లతో కేంద్రం ఇండియా సెమీ కండక్టర్ మి షన్‌ను నెలకొల్పిన విషయం గుర్తుంచుకోవాలన్నారు.
గుజరాత్‌లో పరిశ్రమలు ఏర్పా టు చేస్తే 50 శాతం సబ్సిడీ వస్తుందనే ప్రచా రం మొదలు పెట్టడంతో సహజంగానే సెమీకండక్టర్ పరిశ్రమలు ఆ రా ష్ర్టం వైపు చూస్తాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇండి యా సెమీకండక్టర్ మిషన్ కింద 50 శాతం సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్నా ఇతర రాష్ట్రాల విషయంలో అంత ఉదారత చూపించదన్నారు.
గుజరాత్ అయితే కేంద్ర సబ్సిడీ విషయం ఆ రాష్ర్ట ప్రభుత్వం చూసుకుంటుందనే ప్రచారాన్ని సెమీకండక్టర్ పరిశ్రమలు సహజంగా నే విశ్వసిస్తాయన్నారు. ఈ సవతి తల్లి ప్రేమ గురించి బీజేపీని విమర్శించే ధైర్యం లేకనే బీఆర్‌ఎస్ రాష్ర్ట ప్రభు త్వంపై నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు.
గుజరాత్‌లో సెమీ కండక్టర్ పరిశ్రమలకు ఇస్తు న్న రాయితీలు చూస్తే ఒక్క ఉద్యోగానికి రూ.3.2 కోట్ల సబ్సిడీలు లభిస్తున్నాయని సాక్షాత్తు కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి పేర్కొన్న విషయం తెలిసిందేనని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.