calender_icon.png 20 August, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల పక్షపాతి కాంగ్రెస్

20-08-2025 02:00:20 AM

మాజీ ఎంపీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.అంజన్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి) పేదల పక్షపాతిగా కాంగ్రెస్ ప్రభు త్వం పనిచేస్తున్నదని మాజీ ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ ఎం. అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్ పూర్ కు చెందిన మాజీద్ హుస్సేన్ కు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అంజన్ కుమార్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ..

ప్రైవేటు ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్యం అందించేం దుకు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాజీద్ హుస్సేన్ పాల్గొన్నారు.