20-08-2025 01:58:25 AM
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
ముషీరాబాద్, ఆగస్టు 19 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎం. నర్సింగ్ రావు గౌడ్ ఆయన జీవితకాలం కృషిచేశారని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నా రు. ఈ మేరకు మంగళవారం బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కుషాల్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎం. నర్సిం గ్ రావు గౌడ్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బండారు దత్తాత్రేయ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివా ళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ పార్టీ అభ్యున్నతి కోసం సామాన్య కార్యకర్తగా పనిచేసి ముషీరాబాద్ లో పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు నర్సింగ్ రావు గౌడ్ అండగా నిలిచారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి, బీజేపీ ముషీరాబాద్ నియోజకవర్గం జాయింట్ కన్వీనర్ ఎం. నవీన్ గౌడ్ , ముషీరాబాద్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కంచి ముదిరాజ్, పార్టీ నాయకులు వినుత, జమా ల్ పూరి నందు, ప్రవీణ్, అనిల్, సాయి శశాంక్ తదితరులు పాల్గొన్నారు.