17 July, 2026 | 11:02 AM

భీమునిపాదంలో జల సవ్వడి

22-07-2025 01:36 AM

మహబూబాబాద్, విజయక్రాంతి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రముఖ జలపాతాల్లో ఒకటైన.. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరంలోని భీమునిపాదం జలపాతంలో జల సవ్వడి మొదలైంది. రెండు రోజులుగా జలపాతం 20 అడుగుల ఎత్తు నుంచి వర్షం నీరు పాలధారలా ప్రవహిస్తోంది. నయనానందకరంగా ఉండే ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.