21-11-2025 01:40:11 PM
హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ కేసులో(Formula E car case) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతిపై కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. 'నన్ను అరెస్టు చేసే ధైర్యం ప్రభుత్వం చేయదు'అని కేటీఆర్ తేల్చిచెప్పారు. ఫార్ములా- ఈ కార్ కేసులో ఏమీ లేదన్న విషయం అందరికీ తెలుసని చెప్పారు. ఫార్ములా- ఈ కార్ కేసులో తప్పు చేయలేదని వంద సార్లు చెప్పానని కేటీఆర్ వెల్లడించారు.
ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశంలోనే ఇంత అక్రమ బంధం ఎక్కాడా ఉండదని ఎద్దేవా చేశారు. దానం నాగేందర్ తో రాజీనామా చేయిస్తారని కేటీఆర్ సూచించారు. దానంతో రాజీనామా చేయిస్తామని మావాళ్లతో అన్నారని విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. అనర్హత వేటు పడితే పరువు పోతుందని రాజీనామాకు అవకాశం ఇస్తున్నారని కేటీఆర్ వివరించారు. సాంకేతిక సాకులతో కడియం శ్రీహరిని కాపాడే అవకాశం ఉందేమోనని చూస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయని, ఆ తర్వాత ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపారు.