31-07-2024 11:02:03 AM
అధికారంలోకి వచ్చాక.. భట్టి విక్రమార్క మాట మారుస్తున్నారు
ఆంధ్ర- తెలంగాణ మత ఘర్షణలు వస్తాయన్నారు
తెలంగాణ నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారు
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం కొనసాగుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై శాసనసభలో చర్చ జరుగుతోంది. ఈ చర్చను బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ ప్రారంభించారు. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. పదేళ్ల క్రితం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ చీకట్లతో నిండిపోయిందని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా.. అని ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది అన్నారని ఆయన పేర్కొన్నారు. పదేళ్లో రాష్ట్ర సంపద పెరిగిందని గతంలో భట్టి విక్రమార్క చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక.. మాట మారుస్తున్నారని ఆరోపించారు. విభజన జరిగితే తెలంగాణ అంధకారం అవుతుందన్నారు.. రాష్ట్రానికి పెట్టుబడులు రావు.. ఉన్న పెట్టుబడులు పోతాయన్నారు. తెలంగాణ వస్తే శాంతిభద్రతల సమస్య ఉంటుందన్నారు. ఆంధ్ర- తెలంగాణ మత ఘర్షణలు వస్తాయన్నారు. తెలంగాణలో నక్సలైట్ల రాజ్యం వస్తుందన్నారు. తెలంగాణ వారికి పరిపాలన సామర్థ్యం ఉందా అని అన్నారని కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉత్పత్తులు, సంపద పెరిగిందని భట్టి విక్రమార్క సభలో చెప్పారని వెల్లడించారు.