08-11-2025 01:12:53 AM
పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ గామీణ బ్యాంక్ చైర్మన్, సిబ్బంది
హైదరాబాద్, నవంబర్ 7(విజయక్రాంతి ): ఆంధప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో శుక్రవారం జాతీయ గీతం వందేమాతరం 150 ఏండ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ చైర్మన్ కె.ప్రమోదకుమార్‌రెడ్డి, ఓఎస్‌డీలు డి.శంకరరావు, ఎం.అరుణ్‌కుమార్, విజిలెన్‌స అధికారి హ రీస్‌బేతా, బ్యాంకు మేనేజర్లు, సిబ్బంది ఎం తో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ వందే మాతరం కేవలం జాతీయ గీతమే కాదు, మ నందరిలో ఏకత్వాన్ని, ఐకమత్యాన్ని ప్రతిబింబించే ఒక శక్తివంతమైన చిహ్నమని పేర్కొ న్నారు. స్వాతంత్య్ర సమర సమయంలో వం దే మాతరం ఇచ్చిన ప్రేరణను ఆయన స్మ రించారు.
ఆ గీతం స్వాతంత్య్ర ఉద్యమాన్ని సాధించడంలో కీలకమైన పాత్ర పోషించిందన్నారు. ఇకనుంచి బ్యాంక్‌లో జరిగే ప్రతి కార్యక్రమంలో వందేమాతరం పూర్తి విడివిని ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించ వలసిందిగా సిబ్బందిని కోరారు.