06-11-2025 12:00:00 AM
బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకల కేసులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, కాజేసిన లక్ష కోట్ల సొమ్మును కక్కిస్తామని ప్రగల్భాలు పలికిందని, కానీ అధికారంలోకి వచ్చిన 23 నెలల తర్వాత కూడా బీజేపీ ఎందుకు బీఆర్‌ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి తమను అడుగుతున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
దొంగనే దొంగ అని అరిచినట్లుగా ఉందని కాళేశ్వరం కేసులో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హడావుడి చూస్తుంటే అని విమర్శించారు. బీజేపీ ఎప్పుడూ కూడా ఏ వ్యవస్థల్నీ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకోలేదన్నారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో రఘునందన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు, సీబీఐని తన కక్షపూరి త రాజకీయాల కోసం వాడుకున్న సంగతి దేశానికి తెలుసన్నారు. అప్పట్లోనే ప్రతిపక్ష నేతలంతా సీబీఐని ‘కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్’ అని పిలిచేవారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ వంటి వ్యక్తులను ఎం దుకు అరెస్ట్ చేయలేకపోయారని ప్రశ్నించారు. రెండు సంవత్సరా లు గడిచిపోయా యని, టైమ్ పాస్ చేస్తూ, కమిషన్ గడువును మూడు నెలలు, ఆరు నెలలు పెంచుతూ కాలయాపన చేస్తూ వచ్చారని ఆరోపించారు. ఇటీవల అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెట్టి, సీబీఐకి విచారణ అప్పగిస్తున్నామం టూ తీర్మానం చేశారని, దీని ఆంతర్యమేంటో సీఎం చెప్పాలన్నారు.