calender_icon.png 2 May, 2025 | 5:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న హోంగార్డు, నలుగురు ప్రైవేట్ వ్యక్తులు

01-05-2025 11:10:32 PM

వైరా (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని గన్నవరం సమీపంలోని చెక్ పోస్ట్ వద్ద ఓ హోంగార్డుతో పాటు నలుగురు ప్రైవేటు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడిన సంఘటనపై వైరాలో సర్వత్ర చర్చనీయాంశమైంది. వైరా పోలీస్ స్టేషన్ పరిధి గన్నవరం క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న రామకృష్ణ అనే హోంగార్డుతో పాటు ఆయనకు పరిచయం ఉన్న నలుగురు ప్రైవేటు వ్యక్తులు కలిసి అక్రమ వసూలు పాల్పడుతుండగా గమనించిన పలువురు ఇలా అక్రమంగా వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. దీంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఈ విషయం వైరా పోలీసులకు సమాచారం అందటంతో వెంటనే బ్లూ కోర్ట్ వారిని పంపించి ఆ నలుగురిని, హోంగార్డును వైరా పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.