02-05-2025 03:00:30 PM
యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
రైతులకు రుణమాఫీ లాగే.. నేతన్నకు కూడా రుణమాఫీ
ఐఏహెచ్ టీని భూదాన్ పోచంపల్లిలో నిర్మిస్తాం
హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పర్యటించారు. భూదాన్ పోచంపల్లిలో పోచంపల్లి అర్బన్ బ్యాంక్ హెడ్ ఆఫీసును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రాంతం భూదాన్ పోచంపల్లి అన్నారు. వ్యవసాయం, చేనేత శాఖలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తుమ్మల పేర్కొన్నారు. రైతులకు రుణమాఫీ లాగే.. నేతన్నలకు కూడా రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఐఏహెచ్ టీని భూదాన్ పోచంపల్లిలో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను కేబినెట్ లో చర్చిస్తామని చెప్పారు. సాంకేతిక సమస్యలతో పోచంపల్లి మండలంలో రైతు భరోసా రాలేదని వెల్లడించారు. త్వరలోనే రైతు భరోసా అర్హులైన వారి ఖాతాలో జమ అవుతూందని స్పష్టం చేశారు.