26-09-2025 02:55:37 PM
విద్యుత్ సబ్ స్టేషన్ భూమి పూజలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..*
బోధన్,(విజయక్రాంతి): నిరంతర విద్యుత్ సరఫరాయే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం బోధన్ పట్టణ శివారు పాండు తర్పాలో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తో కలిసి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విచ్చేసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లలో ఒక్క సబ్ స్టేషన్ ఏర్పాటు చేయలేదన్నారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడవద్దని బోధన్ నియోజకవర్గంలో నూతనంగా మూడు సబ్ స్టేషన్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, టీపీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ,మండల అధ్యక్షులు పాషా, నాగేశ్వర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు తూము శరత్ రెడ్డి,సీనియర్ నాయకులు, సాంబిరెడ్డి, దాము, విష్ణు వర్ధన్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.