2 May, 2026 | 1:46 AM

రిటైర్డ్ ఉద్యోగులకు భద్రత కరువు

02-09-2025 12:00 AM

దేశానికి వెలుతురు ప్రసరింపజేసేందుకు తమ జీవితాలను పణంగా పెట్టిన కోల్ ఇండియా, సింగరేణి విశ్రాంత ఉద్యోగుల జీవితాల్లో చీకట్లు కమ్ము కుంటున్నాయి. నేటి ధరలకు అనుగుణ ంగా కరువు భత్యం లేక.. పెన్షన్ పెరగకపోవడం వల్ల దేశ వ్యా ప్తంగా ఐదు లక్షల పెన్షన్ దారులు దారిద్య్ర రేఖ దిగువన జీవిస్తున్నారు. ఎన్నో సార్లు  పెన్షన్ పెంచాలని, మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలని  కేంద్ర మంత్రులకు, రాజకీయ నేతలకు వినతులు సమర్పించినా చర్యలు శూన్యం.

పార్లమెంట్ ప్రతిపాదించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సిఫార్సులను కూడా అమలు చేయడం లేదు. 2007కు ముందు రిటైరయిన వారికి 50 శాతం పెన్షన్ పెంచాల ని.. వినియోగదారుల ధర సూచికను బట్టి కరువు భత్యంతో అనుపాదించి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ సవరణ జ రపాలి. కోల్ ఇండియా, సింగరేణి వార్షిక లాభాల్లో 2 నుంచి 3 శాతం వరకు.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్) పె న్షన్ ఫండ్ కేటాయించాలని కోరుతున్నాం. కోల్ మై న్స్ పెన్షన్ పె ంచడంతో పాటు విశ్రాంత ఉద్యోగులకు, అధికారుల కు ఒకే రకమైన వైద్య విధానం అమలు పరచాల్సిన అవసరము ంది . మె డికల్ బిల్స్, రీయింబర్స్‌మెంట్ చెల్లింపు విడుదల జాప్యం నివారి ంచాలి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15న కలకత్తాలోని కోల్ ఇ ండియా ప్రధాన కార్యాలయం ఎదుట భారీ ప్రదర్శన నిర్వహించే ందుకు కోల్ ఇండియా, సింగరేణి విశ్రాంత ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.

 వేణు మాదవ్, హైదరాబాద్

అద్భుత ఔషధ గుణం కొబ్బరి

వృక్షశాస్త్రం ప్రకారం కొబ్బరి ఒక విత్తనపు గింజ, నట్ మాత్రమే కాకుండా.. ఒక సువాసన, అద్భుత ఔషధ గుణం కలిగిన కాయగా పరిగణిస్తారు. అత్యంత పోషక విలువలు కలిగిన కొబ్బరిని ‘సూపర్‌ఫుడ్’గా భావిస్తారు. కొబ్బరిలో పీచు పదార్థాలు, విటమిన్ బి6, ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. కొబ్బరి ప్రాధాన్యతను గుర్తించిన ‘ఏసియా పసిపిక్ కొకోనట్ కమ్యూనిటీ’ చొరవతో ప్రతి ఏట సెప్టెంబర్ 2ను ‘ప్రపంచ కొబ్బరి దినోత్సవం’గా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. కొబ్బరి ఉత్పత్తులు ఆర్థిక, సామాజిక, పర్యావరణ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్ హెక్టార్లలో 67 బిలియన్ల కొబ్బరిని దాదాపు 90కి పైగా దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. అత్యధికంగా కొబ్బరికాయలను ఇండోనేషియా పండిస్తుండగా, మూడవ అతి పెద్ద ఉత్పత్తి నమోదు చేస్తున్న దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా కొబ్బరి సాగులో సవాళ్లు, కొబ్బరి ఆధారిత కార్యక్రమాలు, చర్చలు, వంటల పోటీలు, పరిశోధనలు, కొబ్బరి పరిశ్రమల గురించి అవగాహన కల్పిస్తున్నారు.

 మధుసూదన్, కరీంనగర్