13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రజావాణికి పోరు.. కార్యాలయాలకు రారు

20-01-2026 02:10 AM

పాపన్నపేట ప్రభుత్వ అధికారుల పనితీరుపై ప్రజల మండిపాటు 

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం ఉద్యోగులకు వరం 

పాపన్నపేట, జనవరి 19: ప్రభుత్వ కార్యాలయానికి ఒకరిద్దరు ఉద్యోగులు ఆలస్యంగా వచ్చారంటే ఏవేవో బలమైన కారణాలు ఉండొచ్చు అనుకుంటారు. మెదక్ జిల్లా పా పన్నపేట మండల ప్రభుత్వ కార్యాలయాలలో మండల స్థాయి అధికారులు, దిగువ స్థాయి ఉద్యోగులందరూ ఉదయం 11:30 గంటలు దాటినా కార్యాలయానికి రాకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. సిబ్బంది వివిధ సమయాల్లో రావడంతో ఇబ్బందుల పాలవుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం 12 దాటినా అగ్రికల్చర్ కార్యాలయంలో ఏఓ, సిబ్బంది రాకపోవడం గమనార్హం.

ఏవో శ్రీనివాస్ రాజు కు ఫోన్ లో సంప్రదించగా మెదక్ లో ఉన్నానని బదులిచ్చారు. ఇద్దరూ ఏఈఓలకు సంప్రదించగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ నిమిత్తం గ్రామాలకు వచ్చామని సమాధానం ఇచ్చా రు. వారి కంటే ముందే కార్యాలయానికి వచ్చిన రైతులు గంటల తరబడి కార్యాలయం ముందు పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయ అధికారి దేవరాజును వివరణ కోరగా 12 అవుతున్నా ఏవో కార్యాలయానికి ఇంకా రాకపోవడం ఏంటని ఆశ్చర్యపోయారు. ఏఈవోలు గ్రా మాలకు వెళ్లి ఉండవచ్చని, విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటానని సమాధానమిచ్చారు.

ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపమే కారణం..

అధికారులు, కిందిస్థాయి సిబ్బంది సమయపాలన పాటించకపోవడమనేది ఉన్నతా ధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు పర్యవేక్షించి తగు చర్యలు తీసుకోవాలని, అధికారులు సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రజావాణికి గైర్హాజరు..

ప్రతి సోమవారం మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సైతం అధికారులు గైర్హాజరవుతున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వ్యవసా య శాఖ అధికారులతో పాటు ఆయా శాఖల అధికారులు హాజరుకాలేదు. వచ్చిన అధికారులు సైతం ఒక్కొక్కరుగా 11:30 వరకు తాపీగా చేరుకున్నారు.