calender_icon.png 20 January, 2026 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

20-01-2026 02:06:49 AM

మెప్మా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల జమ 

చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

గజ్వేల్, జనవరి 19: ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు మహిళలు సద్విని యోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని  ఎ మ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలు అన్నారు. మహిళా సంఘాల వడ్డీ లేని రుణాలకు సంబంధించి 15 నెలల మాఫీ అయిన వడ్డీ డబ్బులను 332 మహిళా సంఘాల ఖాతాలో జమ చే యగా, సోమవారం మహిళా సంఘాలకు చె క్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ మహిళా సంఘాలు ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలతో  వ్యాపారాలు నిర్వహించి ఉపాధి పొందడంతో పాటు ఆర్థికంగా ఉన్నతంగా ఎదగాలన్నారు.

మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అన్ని విధాల అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు అమలు చేస్తుందని, త్వరలో మహిళలకు ఆరోగ్యానికి కూడా  అమలు చేసి వారి వారి ఖాతాల్లో డబ్బు జమ చేస్తుందన్నారు. కాగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సి పాలిటీలోని 339 మహిళా సంఘాలకు 15 నెలల వడ్డీ డబ్బులు రూ. 1.24 కోట్లను ఆ యా మహిళా సంఘాల ఖాతాలో జమ చేసినట్లు మెప్మా కోఆర్డినేటర్ రాజు తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, గజ్వేల్ తహసిల్దార్ శ్రవణ్ కుమార్, మెప్మా ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.