calender_icon.png 13 August, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లేడీ ఓరియంటెడ్ చిత్రం షురూ

09-08-2025 12:00:00 AM

ఈ ఏడాది ఆరంభంలో ‘గేమ్‌ఛేంజర్’లో నటించిన కథానాయిక అంజలి తర్వాత ‘బహిష్కరణ’ అనే వెబ్ సిరీస్ తోనూ మెప్పించింది. ఇటీవల తమిళంలో విశాల్ ‘మదగజరాజ’లోనూ కనిపించింది. విభిన్నమైన పాత్రలు ఎంచు కుంటూ కెరీర్‌లో ముందుకెళ్తున్న అంజలి ఇప్పుడు మరో కొత్త కథను ఓకే చేసింది. ఆమె ప్రధాన పాత్రలో ఓ మహిళా ప్రాధాన్య చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమా లతో ప్రారంభమైంది.

9 క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందిస్తున్న ఈ నూతన చిత్రం ఈ చిత్రానికి రాజచంద్రశేఖర్‌రెడ్డి కందుల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ డైరెక్టర్ గతంలో సుడిగాలి సుధీర్‌తో ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘గాలోడు’ చిత్రాలు రూపొందించారు.

తాజాగా కథానాయిక అంజలితో చేస్తున్న ఈ చిత్రం దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల కెరీర్‌లో మరో ప్రత్యేక సినిమా కానుందని టీమ్ చెబుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమాకు సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. ఈ చిత్రానికి సంబం ధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాతలు త్వరలో వెల్లడించనున్నారు.