9 July, 2026 | 8:08 AM

ఈ చిత్రాన్ని 16 రోజుల్లో కంప్లీట్ చేశాం

17-12-2024 12:00 AM

హీరోయిన్ వేదిక లీడ్ రోల్‌లో నటించిన సినిమా ‘ఫియర్’. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డాక్టర్ హరిత గోగినేని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డాక్టర్ వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించారు. డిసెంబర్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ హరిత మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ సినిమాను 16 రోజుల్లో కంప్లీట్ చేశాం. 39 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డ్స్ వచ్చాయి. సినిమా స్టార్ట్ చేసిన 7 నెలల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాం. సినిమాలో ఒక కలర్ ప్యాట్రన్ యూజ్ చేశాం. సీన్ మూడ్‌కు తగిన కలర్ కాస్ట్యూమ్స్ ఉపయోగించాం. ఇప్పటిదాకా మన ఇండస్ట్రీలో ఇలా ఒక యూనిక్ కలర్ ప్యాట్రన్‌లో సినిమా రాలేదు. కొన్ని సీన్స్ సింగిల్ షాట్ సీన్స్ చేశాం’ అన్నారు. కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొన్నారు.