13 May, 2026 | 10:28 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

డీఎస్సీకి 2.78 లక్షల దరఖాస్తులు

21-06-2024 01:16 AM

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): డీఎస్సీ దరఖాస్తు గడువు గురువారం రాత్రి 11.50 గంటలతో ముగిసింది. గురువారం 8.30 గంటల వరకు 2,78,834 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఫీజు చెల్లించిన వారు 2,84,997 మంది కాగా, అప్లికేషన్లు ఎడిట్ చేసుకున్నవారు 73,413 మంది ఉన్నారు. దరఖాస్తు గడువును పెంచే యోచనలో అధికారులు లేరు. కానీ, అభ్యర్థులు మరో రెండు రోజు లు పొడిగించాలని కోరుతున్నారు. దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో త్వరలోనే డీఎస్సీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించే వీలుంది. ఇదిలా ఉంటే డీఎస్సీ పరీక్షలను కొన్ని రోజులు వాయిదా వేయాలనే డిమాండ్ అభ్యర్థుల నుంచి వినిపిస్తోంది. ముందస్తుగా ప్రకటించిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం జూలై 17 నుంచి 31 వరకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.