13 May, 2026 | 9:07 PM

Breaking News

స్త్రీలు ఇక శ్రీమంతులే!

21-06-2024 01:19 AM
  • మహిళా సంఘాల బలోపేతానికి సర్కారు చర్యలు

రూ.20వేల కోట్లతో ఆర్థిక భరోసా ప్రణాళికలు

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి)ః మహిళా సంఘాల బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.గ్రామీణాభివృద్ధి సంస్థల ఆధ్వర్యంలో రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ఆర్దిక సంవత్సరం (202425) రూ.20.39 వేల కోట్లు 3,56,273 సంఘాలకు అందించనుంది.  డిసెంబర్ 2023 నుంచి మార్చి 2024 వరకు మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల కింద అడ్వాన్స్‌గా 2,53,864 సంఘాలకు రూ.264.34 కోట్ల రుణ సౌకర్యం కల్పించింది. అంతేకాకుండా .10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ.2 లక్షలవరకు అప్పు బీమా కల్పించింది. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రూ.20 వేల కోట్లకు అదనంగా మరో  2,25,00ం మంది మహిళలకు జీవనోపాధి కింద రూ.4,500 కోట్లను బ్యాంకుల నుంచి అందించనుంది.

ఇప్పటికే మహిళా సంఘాలకు ప్రభుత్వ సూళ్ల యూనిఫాంల స్టిచ్చింగ్‌తో రూ.50 కోట్లు ఆదాయం సమకూరేలా చేసింది. అంగన్‌వాడీల్లో చిన్నారులకు అందించే యూనిఫాంను కూడా మహిళా సంఘాలకే అప్పగించనుంది. పోలీసు యూనిఫామ్‌లను సైతం వీరితోనే కుటించాలని సర్కారు నిర్ణయించింది. వీటితోపాటు పాడి పరిశ్రమ, కోళ్లఫామ్‌ల నిర్వహణలో శిక్షణ ఇప్పించి ఆర్థిక చేయూతనందించాలనే యోచనలో ఉంది. మొత్తంగా కాంగ్రెస్ సర్కారు స్త్రీలను శ్రీమంతులను చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.